కాంగ్రెస్ కు ప్రజలే గుణపాఠం చెబుతారు: హరీష్ రావు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న బలిదానాలను చూసి కూడా, తెలంగాణపై స్పందించకుండా వేచి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.